For the best experience use Mini app app on your smartphone
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దాస్‌ పదవీ కాలం పీఎం మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏది ముందైతే దాని వరకు ఉంటుందని ఆ కమిటీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దాస్ 2024 డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేశారు.
short by Sri Krishna / 06:17 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone