ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నయ్య రాజబాబు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని జయప్రద ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ. "అన్నయ్య రాజబాబు చనిపోయారని చెప్పడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా," అని తెలిపారు. రాజబాబు నటుడు & చిత్ర నిర్మాత అని, చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
short by
/
11:32 pm on
28 Feb