కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలో 24వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
short by
srikrishna /
07:51 am on
12 Aug