కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ వేళ మంగళవారం ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. యర్రగుంట్ల వద్ద ఆయనను తరలిస్తున్న వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ‘‘పులివెందులలో బయటివాళ్లను అనుమతించి, నన్ను బలవంతంగా తరలిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగమే. బిహార్‌లోనూ ఇంత దారుణమైన పరిస్థితులు ఉండవేమో,’’ అని ఈ సందర్భంగా అవినాష్ చెప్పారు.
short by
srikrishna /
09:27 am on
12 Aug