పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం కృష్ణా ట్రిబ్యునల్-2 విచారణలో ఉన్న నేపథ్యంలో జాతీయ హోదా సాధ్యం కాదని జల్‌శక్తి శాఖ పేర్కొంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
short by
Srinu /
05:54 pm on
28 Mar