వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం పోలవరం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు వైసీపీ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిందనడంపై ఆయన స్పందించారు. పోలవరం నిధులు మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగాయన్నారు.
short by
Bikshapathi Macherla /
06:23 pm on
28 Mar