చట్టబద్ధంగా వివాహ వయస్సు లేకున్నా పరస్పర సమ్మతితో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి వయస్సు లేని కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించలేమని చెప్పింది. సహజీవనంలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. వారికి తగిన రక్షణ కల్పించాలంది.
short by
srikrishna /
02:45 pm on
05 Dec