రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తమ సోదరి కొడుకైన 17 రోజుల పసికందును చంపిన కేసులో నలుగురు మహిళలు అరెస్టయ్యారు. తమకు వివాహాలు కాకపోవడం, తమ సోదరికి రెండో కొడుకు పుట్టాడనే అసూయతో ఆ అక్కాచెల్లెళ్లు ఈ హత్య చేశారని తేలింది. నవజాత శిశువును బలి ఇవ్వడం వల్ల తమకు పెళ్లిళ్లు అవుతాయని వారు నమ్మారు. నిందితుల్లో ఒకరు ఆ శిశువును ఒడిలో పెట్టుకుని, పూనకం వచ్చినట్లు ఊగుతూ ఏవో మంత్రాలు జపించడం ఓ వీడియోలో కనిపించింది.
short by
srikrishna /
11:38 am on
16 Nov