తమిళనాడు కడలూరు జిల్లాలో కడుపునొప్పి అని చెప్పిన 18 ఏళ్ల నవ వధువును 25 ఏళ్ల భర్త ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె 8 నెలల గర్భిణి అని వెల్లడైంది. వారికి సెప్టెంబర్ 4నే వివాహమైంది. దీంతో తన భార్య గర్భానికి కారణమైన వారిని గుర్తించాలంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి గర్భానికి కారణం ఆమె 32 ఏళ్ల మేనమామ అని విచారణలో తేలింది. ఆ వ్యక్తి 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.
short by
srikrishna /
01:18 pm on
19 Nov