సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలి 13 మంది చనిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా,” అని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
short by
Devender Dapa /
10:26 pm on
30 Jun