క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఆరోపించారు. తన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టులో పిల్ వేస్తామని చెప్పారు. ప్రవీణ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో స్పష్టత లేదని, ట్రావెల్ చేసింది, ఆగింది, మద్యం కొనుగోలు చేసింది ఎక్కడనేది నిరూపించలేదన్నారు. మద్యం తాగి చనిపోయాడని కావాలని రాసినట్లు ఉందన్నారు.
short by
Bikshapathi Macherla /
08:27 pm on
20 Apr