తిరుమల పరకామణి చోరీ కేసులో నవంబర్ 25న సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పకరామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. భూమన టీటీడీ ఛైర్మన్ ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ 9న లోక్‌అదాలత్‌లో ఈ కేసును వైసీపీ నేతలు రాజీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
short by
srikrishna /
11:55 am on
25 Nov