పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి వీర్ల తిరునాళ్లలో విద్యుత్‌షాక్‌కు గురై ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. తిరునాళ్లలో చివరి రోజైన ఆదివారం రాత్రి కొణతాల(ఆయధాలు)కు స్నానం చేయించేందుకు నాగులేరులో దిగిన వారు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. అప్పటికే తెగి నీళ్లలో పడి ఉన్న వైరు నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
short by
Devender Dapa /
11:25 pm on
23 Nov