పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఏఐఎంఐఎం పిలుపుమేరకు హైదరాబాద్ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయాలను తాను సమర్థిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.
short by
Bikshapathi Macherla /
04:13 pm on
25 Apr