పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత వైమానిక దళం 'ఆక్రమణ్' పేరిట విన్యాసాలు నిర్వహించిందని వార్తాసంస్థ ANI నివేదించింది. రఫేల్ యుద్ధ విమానాల సారథ్యంలో ప్రధాన ఫైటర్ జెట్‌లు ఇందులో పాల్గొన్నాయి. మైదానాలు, పర్వత ప్రాంతాలు సహా వివిధ భూభాగాల్లో క్లిష్టమైన గ్రౌండ్ అటాక్ మిషన్‌లు చేపట్టేలా వాయుసేన సాధన చేసిందని సమాచారం. భారత నౌకాదళం కూడా గురువారం ఐఎన్ఎస్ సూరత్‌తో అత్యాధునిక మిసైల్ టెస్ట్ నిర్వహించింది.
short by
srikrishna /
05:00 pm on
25 Apr