కృష్ణా జిల్లా పెదపారుపూడిలోని ఓ ఫంక్షన్‌లో వేడి సాంబారు గిన్నెలో పడి ప్రేరణ అనే 4ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులతో కలిసి రాత్రి వేళ ఫంక్షన్‌కు వెళ్లిన ప్రేరణ ఆడుకుంటూ భోజనాల కోసం సిద్ధం చేసిన సాంబారు గిన్నెపై కూర్చుంది. ప్లేటు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా వేడి సాంబారులో పడిపోయింది. దీంతో చిన్నారి శరీరం పూర్తిగా కాలింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది.
short by
Srinu /
03:42 pm on
26 Nov