జనంతో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు నుంచి పడి ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు గాయపడిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి కూడలి వద్ద జరిగింది. ఆ విద్యార్థినులతో సహా పలువురు ఫుట్‌బోర్డ్‌పై నిలబడగా, బస్సు కదిలాక అదుపుతప్పి ఆ ఇద్దరు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో 16 ఏళ్ల బోడ అఖిల కాళ్ల పై నుంచి బస్సు వెళ్లింది. వారిద్దరూ చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
short by
Sri Krishna /
05:32 pm on
03 Dec