హైదరాబాద్ బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో బాంబు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన టీచర్లు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్కూల్ వద్దకు చేరుకున్న ఆర్మీ అధికారులు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కలిసి 3 గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామని వారు చెప్పారు.
short by
Bikshapathi Macherla /
09:30 pm on
29 Jan