For the best experience use Mini app app on your smartphone
సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు ఆ సంస్థకు ఈ మెయిల్ రావడంతో దానిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో గురువారం అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు.
short by srikrishna / 02:43 pm on 04 Dec
For the best experience use inshorts app on your smartphone