నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాలో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీయొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
short by
/
09:41 am on
17 Nov