నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకోవచ్చని పేర్కొంది. దీనికి ‘దిత్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆదివారం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈనెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.
short by
srikrishna /
04:28 pm on
27 Nov