బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. బుధవారం నాటికి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని, దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అల్పపీడనంతో రాష్ట్రంలో చవి తీవ్రత తగ్గింది.
short by
Devender Dapa /
08:39 am on
22 Nov