పాకిస్థాన్ షార్ట్ పిచ్ బౌలింగ్ వ్యూహాలకు నిరసనగా 1978 నవంబర్ 3న పాక్‌తో జరిగిన వన్డేను భారత్ వదులుకుంది. భారత్ 3 ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన సమయంలో పాక్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ వరుసగా నాలుగు బౌన్సర్లను బ్యాటర్ తల మీదుగా వేశాడు. అయినా అంపైర్ వాటిని వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో అప్పటి కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ భారత బ్యాటర్లను వెనక్కి పిలిపించడంతో ఆ మ్యాచ్ పాకిస్థాన్‌కు దక్కింది.
short by
Srinu Muntha /
08:08 am on
23 Feb