For the best experience use Mini app app on your smartphone
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద బైక్‌ను తప్పించబోయి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నార్కట్‌పల్లి- అద్దంకి-మేదరమెట్ల రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కారు ఎన్‌ఎస్‌పీ అద్దంకి బ్రాంచ్‌ కాలువలోకి దూసుకెళ్లగా, అక్కడే ఉన్న అయ్యప్ప మాలధారులు వెంటనే అప్రమత్తమై డ్రైవర్‌ను ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.
short by Devender Dapa / 03:12 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone