శరీరం లోపల ప్రతి అవయవానికే కాదు, బయట కంటికి కనిపించే ప్రతి భాగానికీ కూడా ఒక పేరు ఉంటుంది. రెండు కనుబొమల మధ్య బొట్టు పెట్టుకునే భాగాన్ని గ్లాబెల్లా అంటారు. పెదాల పైన, ముక్కు కింద ఉండే గుంట భాగాన్ని ఫిల్‌ట్రమ్ అని పిలుస్తారు. మోచేతి దగ్గర మడతపెట్టినప్పుడు ఏర్పడే బొడుపును ఒలెక్రనాన్ అని, కాలి బొటన వేలును హాలక్స్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇక వీపుపై పొడుచుకు వచ్చే ఎముక పేరు స్కాపులా.
short by
Devender Dapa /
09:14 pm on
11 Nov