బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 1.5 కిమీ మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వచ్చే 24 గంటలు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
short by
Sri Krishna /
03:51 pm on
26 Dec