వైసీపీ నేత వల్లభనేని వంశీని గన్నవరం కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. కృష్ణా జిల్లాలోని ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీసు స్టేషన్‌లో వంశీపై కేసు నమోదైంది. దీనిపై విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేయగా, శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
short by
srikrishna /
06:56 pm on
28 Mar