For the best experience use Mini app app on your smartphone
తనకు ఇల్లు చాలా సంతోషకరమైన ప్రదేశం అని, అక్కడ ఎంతో ఆనందంగా ఉంటానని నటి రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “ఎంతో మంది ప్రేమాభినాలు, గౌరవం పొందినప్పటికీ నేను ఓ కుమార్తె, సోదరి, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తా,” అని అన్నారు. హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్‌లో ఉన్నారనే వార్తల మధ్య ఈ కామెంట్స్ వచ్చాయి. “నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతా. ఎదుటివారిని గౌరవించే వారంటే కూడా ఇష్టం,” అని రష్మిక తెలిపారు.
short by Rajkumar Deshmukh / 07:59 pm on 28 Jan
For the best experience use inshorts app on your smartphone