ఆదివారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ధాటికి గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. ఈ ఘటనలో శిథిలాలు మీద పడి శేఖర్ మండల్ అనే 24 ఏళ్ల కూలీ మృతి చెందాడు. మరో నలుగురు కూలీలు కుల్దాన్, రవిపాశ్వాన్, నర్సింహ, మహేశ్వర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
short by
/
08:08 am on
15 Sep