పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భార్య కాపురానికి రావడం లేదని మద్యం మత్తులో హైటెన్షన్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పోలీసుల ప్రకారం, ఎన్టీపీసీలో కూలీగా పనిచేసే బిహార్‌కు చెందిన అజయ్, భార్య ప్రీతితో గొడవపడటంతో ఆమె స్థానికంగా ఉండే బంధువుల దగ్గరికి వెళ్లింది. దీంతో టవర్ ఎక్కిన అజయ్ విద్యుత్ వైర్లు పట్టుకునేందుకు యత్నించాడు. పోలీసులు భార్యను పిలిపించడంతో కిందికి దిగాడు.
short by
Bikshapathi Macherla /
11:34 pm on
11 Mar