పల్నాడు జిల్లా గణపవరం వద్ద గురువారం రాత్రి కంటెయినర్‌ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరంతా 20-22 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థులు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉండగా, మరొకరు గోవింద దీక్షలో ఉన్నారు. వీరంతా అయ్యప్ప భజనకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.
short by
srikrishna /
10:14 am on
05 Dec