వికారాబాద్ జిల్లా గడ్డమీది గంగారంలో బుధవారం 21ఏళ్ల శిరీష ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు 5 నెలల క్రితమే వివాహమైంది. వంట బాగా చేయట్లేదని, తక్కువ చదువుకున్నావంటూ ఆమెను భర్త శివలింగం వేధించేవాడనే ఆరోపణలున్నాయి. మంగళవారం శివలింగం తన భార్యతో గొడవపడి, ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. మర్నాడు శిరీష ఫోన్ చేయగా, ‘నీవు నాకు అక్కర్లేదు, అక్కడే చచ్చిపో’ అని చెప్పాడు. మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఉరేసుకున్నారు.
short by
srikrishna /
12:15 pm on
27 Nov