ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయం మంగళవారం భక్తుల కోసం డ్రెస్ కోడ్ జారీ చేసింది. ఇది వచ్చే వారం నుంచి అమలు కానుంది. ఇందులో భాగంగా షార్ట్ స్కర్టులు, చిరిగినట్లుగా ఉండే ప్యాంటులు, బట్టలు ధరించడం నిషేధించారు. అలాంటి దుస్తులు ధరించిన వారిని ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ ట్రస్ట్ తెలిపింది. శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు, ప్రధానంగా భారతీయ దుస్తులు ధరించాలని సూచించింది.
short by
Devender Dapa /
10:53 pm on
28 Jan