వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్న ఐదేళ్లలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుంచి రూ.222 కోట్లు ఖర్చు చేశారని NDTV కథనం పేర్కొంది. ఇందులో విమానాల కోసం రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీలకు రూ.87.02 కోట్లు, నిర్వహణ కోసం రూ.23.31 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ కథనాన్ని మంత్రి నారా లోకేశ్ షేర్ చేస్తూ, ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా జగన్ విహారయాత్రల కోసం రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
short by
srikrishna /
11:45 am on
03 Dec