మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో గురువారం సాయంత్రం ఆయన చేరారు. కాగా మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు వరుసగా రెండుసార్లు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసిన వ్యక్తిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కీర్తి గడించారు.
short by
Devender Dapa /
10:36 pm on
26 Dec