కర్ణాటక మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ పేరుతో రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని, డబ్బు చెల్లించకుండా మోసం చేసిన శ్వేతాగౌడ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. శ్వేతాగౌడ తన ఫోన్‌లో వర్తూరు పేరును మైసూరు పాక్‌గా సేవ్ చేసుకుంది. BJP నేత చలపతి పేరును గులాబ్ జామూన్‌గా, మరో నాయకుడి పేరును రసగుల్లాగా పెట్టుకుంది. ధనవంతులనే లక్ష్యంగా చేసుకుని ఆమె మోసాలకు పాల్పడుతుందని పోలీసులు గుర్తించారు.
short by
Srinu Muntha /
04:20 pm on
26 Dec