For the best experience use Mini app app on your smartphone
మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి హల్దీ వాగులోకి దూసుకెళ్లింది. 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై నాగపుర్ నుంచి హైదరాబాద్ వైపు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హల్దీవాగు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో.. పూర్తిగా వాగులోకి కంటైనర్ దూసుకెళ్లకుండా ఆగిపోయింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ భీమల్ యాదవ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
short by Devender Dapa / 07:13 pm on 24 Nov
For the best experience use inshorts app on your smartphone