మెదక్ జిల్లా తూప్రాన్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడమే కాక వారిపై నుంచి దూసుకెళ్లడంతో బైక్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు దశరథ్‌కు మంటలు అంటుకుని, తీవ్ర గాయాలైనట్లు కనిపించింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పి, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ముందు వెళ్తున్న బైక్‌ను గమనించని డ్రైవర్, టిప్పర్‌ను ఒక్కసారిగా ఎడమ వైపుకు తిప్పడంతో ప్రమాదం జరిగింది.
short by
Rajkumar Deshmukh /
07:58 pm on
03 Dec