తనతో సంబంధం కొనసాగించనని మేనల్లుడు అలోక్ మిశ్రా చెప్పడంతో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌లోనే వివాహిత మణికట్టును కోసుకుంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. భర్త, ఇద్దరు పిల్లలతో జీవించే పూజాకు తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన అలోక్‌తో శారీరక బంధం ఉంది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి 7 నెలలు అతడితో సహజీవనం చేసింది. ఇటీవల వారిద్దరూ గొడవలతో విడిపోగా, ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది.
short by
srikrishna /
10:16 pm on
20 Oct