వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందుకు తెలంగాణ సీఎం రేవంత్, పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. కాగా మామునూరు విమానాశ్రయం 32 ఏళ్ల క్రితం మూతపడింది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి త్వరలో మళ్లీ విమానాలు ఎగరనున్నాయి.
short by
Devender Dapa /
11:25 pm on
28 Feb