మువ్వన్నెల జెండా ఓ ఉద్వేగం, స్ఫూర్తి అని.. ప్రపంచంలోనే శక్తిమంతమైన త్రివర్ణ పతాకాన్ని మన తెలుగువాడు రూపొందించడం అందరికీ గర్వకారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. సైనికుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు.
short by
Devender Dapa /
11:27 pm on
11 Aug