రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళలోని కోచిలో ఐసీయూలో ఉన్న వధువు అవనికి, వరుడు శరణ్ అక్కడే తాళి కట్టాడు. వీరి వివాహం శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సి ఉంది. అయితే, ముహూర్తానికి ముందు అవనిని అలంకరణ కోసం కుమారకోమ్‌కు తీసుకెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అవని వెన్నెముకకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యుల కోరిక, వైద్యుల అనుమతితో ఆసుపత్రిలోనే ఈ జంట పెళ్లి చేసుకుంది.
short by
Srinu /
10:15 pm on
21 Nov