హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డుపై వెళ్తున్న స్కూటీని మద్యం మత్తులో బెంజ్ కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఫుట్‌పాత్‌పై పడిపోగా, ముందుకు వెళ్లిన నిందితులు మరో కారులో వెనక్కి వచ్చి "మా బెంజ్ కారుకే డ్యామేజ్ చేస్తావా" అని దూషిస్తూ అతడిని చితకబాదినట్లు వారు చెప్పారు. అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
short by
Bikshapathi Macherla /
08:10 am on
22 Jan