మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్‌ను కోల్పోయినందుకు భారత్ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన నిరాడంబరమైన మూలాల నుంచి వచ్చి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. ఆయన జ్ఞానం, వినయం సుస్పష్టంగా కనిపిస్తాయి,” అని ప్రధాని ట్వీట్ చేశారు.
short by
Devender Dapa /
11:02 pm on
26 Dec