మూవీ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి మరో కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమంది రవిపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్టు చూపనున్నారు. కాగా 21 వేల సినిమాలను పైరసీ చేసిన రవిని పోలీసులు నవంబరు 15న అరెస్టు చేశారు.
short by
Devender Dapa /
04:36 pm on
26 Nov