ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని ఓ కూడలి వద్ద జామాయిల్ కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తుండగా ఇది జరిగింది. మలుపు వద్ద వేగంగా తిరగడంతోనే ట్రాలీ బోల్తా పడినట్లు వీడియోలో కనిపించింది. అయితే సమీపంలో ప్రజలెవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద దృశ్యాలు ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
short by
Devender Dapa /
08:09 pm on
22 Feb