ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన శ్రీకాకుళం కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీడియో కాల్‌లో మాట్లాడారు. స్వదేశానికి రాలేక, అక్కడ పని దొరకక అల్లాడిపోతున్నట్లు వారు ఆయనకు వివరించారు. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని, భయపడొద్దని ధైర్యంగా ఉండాలని మస్కట్ బాధితులకు రామ్మోహన్ భరోసా ఇచ్చారు. కార్మికుల కుటుంబాలకు కేంద్ర మంత్రి ధైర్యం చెప్పారు.
short by
Bikshapathi Macherla /
11:10 pm on
18 Apr