మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం తెల్లవారుజామున సుమారు 1- 2 గంటల మధ్య జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ధ్రువీకరించారు. మృతుల్లో 25 మంది ఆచూకీ గుర్తించామని, మిగిలిన ఐదుగురిని గుర్తించాల్సి ఉందని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. 60 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారన్నారు. పవిత్ర స్నానం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది.
short by
Srinu Muntha /
07:33 pm on
29 Jan