మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైళ్లను రద్దు చేయలేదని, చేయబోము కూడా అని రైల్వే శాఖ తెలిపింది. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రైళ్లు రద్దు చేశారంటూ వార్తలు రావడంతో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి 360 రైళ్లు నడుపుతున్నామని, ప్రతి 4 నిమిషాలకో ట్రైన్ వెళ్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ క్రమంలో రద్దీ నియంత్రణకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ట్రైన్లను సిద్ధం చేస్తోంది.
short by
Rajkumar Deshmukh /
09:00 pm on
29 Jan