For the best experience use Mini app app on your smartphone
మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్‌గా ఉన్న దేవవ్రత్‌కు మహారాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ముంబై చేరుకునేందుకు దేవవ్రత్‌ ఆదివారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.
short by / 11:52 am on 15 Sep
For the best experience use inshorts app on your smartphone